ప్రభాస్ త్రివిక్రం కు ఛాన్స్ ఇస్తాడా..?

July 19, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్నాడు. బాహుబలితో వచ్చిన క్రేజ్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్న ప్రభాస్ సినిమా చేస్తే పాన్ ఇండియా రిలీజ్ అనేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రాధే శ్యాం, సలార్, ఆదిపురుష్ మూడు సినిమాలు నేషనల్ వైడ్ గా భారీ రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా త్రివిక్రం కూడా ప్రభాస్ కోసం ఓ కథ రెడీ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ప్రభాస్ కేవలం తెలుగు సినిమా చేయాలంటే అది సాధ్యపడే విషయం కాదు. త్రివిక్రం ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఒకవేళ ప్రభాస్ కోసం త్రివిక్రం కూడా పాన్ ఇండియా రేంజ్ కథ రాసుకున్నాడో ఏమో కాని త్రివిక్రం కథ ప్రభాస్ వినేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. కథ నచ్చితే త్రివిక్రం డైరక్షన్ లో ప్రభాస్ సినీమ కన్ ఫర్మ్ చేస్తాడని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం చెప్పడం కష్టమే.Related Post

సినిమా స‌మీక్ష