క్రేజీ కాంబో బడ్జెట్ 200 కోట్లు..!

July 19, 2021


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తుందని టాక్. జనతా గ్యారేజ్ తర్వాత డైరక్టర్ కొరటాల శివ, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు బడ్జెట్ 200 కోట్ల దాకా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, కొరటాల శివ రెమ్యునరేషన్స్ తో పాటుగా స్టార్ కాట్ రెమ్యునరేషన్ కోసమే దాదాపు 70 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఇక మిగిలిన బడ్జెట్ తో సినిమా చేస్తారని టాక్.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ 30వ సినిమాగా వస్తున్న ఈ సినిమాతో నేషనల్ లెవల్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఎన్.టి.ఆర్.  కొరటాల శివ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష