డైరక్టర్ గా స్టార్ కమెడియన్..!

July 19, 2021


img

టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ తన కామెడీతో ఆడియెన్స్ ను మెప్పిస్తున్న వెన్నెల కిశోర్ తనలోని డైరక్షన్ టాలెంట్ కూడా ఆడియెన్స్ కు చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఆల్రెడీ రెండు సార్లు ఆ ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన వెన్నెల కిశోర్ ఈసారి ఓటిటి టార్గెట్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. వెన్నెల కిశోర్ డైరక్షన్ లో వచ్చిన జఫ్ఫా.. వెన్నెల 1.5 సినిమాలు నిరాశపరచాయి. డైరక్టర్ గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు వెన్నెల కిశోర్. 

కమెడియన్ గా మంచి ఫాం లో ఉన్న వెన్నెల కిశోర్ డైరక్టర్ గా కూడా ఆడియెన్స్ మెప్పు పొందాలని చూస్తున్నాడు. ఓటీటీ రిలీజ్ అయితే హిట్ ఫ్లాప్ అన్న బాధ ఉండదు. అందుకే ఓటీటీ రిలీజ్ టార్గెట్ తో ఓ సినిమా కథ సిద్ధం చేసుకున్నాడట. త్వరలోనే వెన్నెల కిశోర్ డైరటోరియల్ మూవీ డీటైల్స్ బయటకు వస్తాయని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష