ఆ లక్కీ ఛాన్స్ తమన్ పట్టేశాడు..!

July 19, 2021


img

స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ తన కెరియర్ లో బిగ్గెస్ట్ ఛాన్స్ పట్టేశాడు. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న తమన్ తన నెక్స్ట్ సినిమా భారీ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. శంకర్, రాం చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాకు తమన్ మ్యూజిక్ డైరక్టర్ గా కన్ఫర్మ్ అయ్యారు. కొన్నాళ్లుగా ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ ఎవరన్న దాని మీద రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గా తమన్ కే ఆ లక్కీ ఛాన్స్ దక్కింది. 

శంకర్ సినిమాలకు కామన్ గా అయితే ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు. శంకర్ ప్రతి సినిమాకు రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. కాని ఈ సారి ఆ ఛాన్స్ తమన్ అందుకున్నాడు. ఇలాంటి ప్రెస్టిజియస్ మూవీ ఛాన్స్ వచ్చినందుకు తమన్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు.Related Post

సినిమా స‌మీక్ష