అమేజాన్ ప్రైం తో నిత్యా మీనన్ క్రేజీ డీల్..!

June 19, 2021


img

ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ అంతా ఓటిటి బాట పట్టారు. వెబ్ సీరీస్ లతో కూడా వారు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వెబ్ సీఎరీస్ లు చేస్తుండగా మళయాళ భామ నిత్యా మీనన్ కూడా హిందీలో ఓ వెబ్ సీరీస్ తో మెప్పించింది. బ్రీత్.. ఇన్ టు ది షాడోస్ అంటూ అభిషేక్ బచ్చన్ తో వెబ్ సీరీస్ లో నటించిన నిత్యా మీనన్ అమేజాన్ ప్రైం లో మరో వెబ్ సీరీస్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది. 

కన్నడ దర్శకుడు ఈ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ లో నటించేందుకు గాను నిత్యా మీనన్ కు ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నారట. ఈమధ్యనే నిన్నిలా నిన్నిలా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిత్యా మీనన్ తెలుగులో గమనం సినిమాలో నటిస్తుంది. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్, రానా కాంబోలో వస్తున్న అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో కూడా నిత్యా మీనన్ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో నిత్యా మీనన్ కెరియర్ మళ్లీ ఫాం లోకి వచ్చేలా ఉంది. Related Post

సినిమా స‌మీక్ష