రాధే శ్యాం కామెడీ అదుర్స్..!

June 19, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న సినిమా రాధే శ్యాం. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో లవ్ స్టోరీ.. ఫైట్లు.. చేజింగ్ లు మాత్రమే కాదు కామెడీ కూడా సూపర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని సినిమాలో నటిస్తున్న కమెడియన్ ప్రియదర్శి చెప్పారు. సినిమాలో తన కామెడీ బాగుంటుందని.. తనతో పాటుగా ప్రభాస్ సీన్స్ బాగా వచ్చాయని. ప్రభాస్ కామెడీ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అన్నారు. కొద్దిపాటి షూటింగ్ తో సినిమా పూర్తి చేసుకోనున్న రాధే శ్యాం సినిమాను త్వరలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమా తర్వాత సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు ప్రభాస్.Related Post

సినిమా స‌మీక్ష