సిద్ధార్థ్ రెమ్యునరేషన్.. తగ్గేదిలే..!

June 18, 2021


img

యూత్ స్టార్ సిద్ధార్థ్ తెలుగులో మహా సముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. సిద్ధార్థ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు గాను సిద్ధార్థ్ 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. 

టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకున్నా సరే సిద్ధార్థ్ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదని సమాచారం. మహా సముద్రం తో పాటుగా సిద్ధార్థ్ కు మరో తెలుగు సినిమా ఆఫర్ కూడా వచ్చిందట. ఆ సినిమాలో కూడా నటించేందుకు 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగాడని టాక్. మొత్తానికి తెలుగులో ఫాం లో లేకపోయినా సిద్ధార్థ్ మాత్రం ఇక్కడ వచ్చిన అవకాశాలకు భారీగా డిమాండ్ చేసి షాక్ ఇస్తున్నాడు.

 


Related Post

సినిమా స‌మీక్ష