నాని 'మీట్ క్యూట్' లో నలుగురు హీరోయిన్లు..!

June 18, 2021


img

నాచురల్ స్టార్ తన ప్రొడక్షన్ లో నాల్గవ సినిమా చేస్తున్నాడు. అ!, హిట్, హిట్ 2 సినిమాల తర్వాత మీఎట్ క్యూట్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నాని సిస్టర్ దీప్తిని డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఈ సినిమా చేస్తున్నారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. అందులో ఇద్దరు హీరోయిన్స్ గా నివేదా థామస్, కాజల్ ఓకే అవగా మరో ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అదా శర్మ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుందని టాక్.   

నాని నిర్మిస్తున్న మీట్ క్యూట్ సినిమాలో క్యారక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది చూపిస్తున్నాడు నాని. ఇక నాని నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే టక్ జగదీష్ ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అవగా శ్యాం సింగ రాయ్ సినిమా సెట్స్ మీద ఉంది.Related Post

సినిమా స‌మీక్ష