రష్మిక తో నితిన్ .. భీష్మ జోడీ ఫిక్స్..!

June 18, 2021


img

నితిన్ జోడీగా మరోసారి రష్మిక నటించనుంది. ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్ ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీ డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేఏసుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అందాదున్ రీమేక్ గా వస్తున్న మాస్ట్రో ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే వక్కంతం వంశీ డైరక్షన్ లో మూవీకి ముహుర్తం పెట్టనున్నారు. 

నితిన్, రష్మిక నటించిన భీష్మ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ ఇద్దరు కలిసి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. రైటర్ గా సక్సెస్ అయిన వక్కంతం వంశీ డైరక్టర్ గా చేసిన తొలి ప్రయత్నం నా పేరు సూర్య ఫ్లాప్ అయ్యింది. వక్కంతం వంశీ రెండో ప్రయత్నంగా నితిన్ తో సినిమా చేస్తున్నాడు.   



Related Post

సినిమా స‌మీక్ష