టాలీవుడ్ లో మరో కొత్త ఓటిటి..!

June 17, 2021


img

కరోనా వల్ల థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో ఎప్పుడు మూతపడుతాయో తెలియని పరిస్థితి అందుకే ఇప్పుడు అందరు ఓటిటి ల మీద ఫోకస్ పెట్టారు. చిన్న బడ్జెట్ సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్స్ట్, జీ 5 ఓటిటిలు సత్తా చాటుతుండగా ఇప్పుడు కొత్తగా మరో ఓటిటి ఫ్లాట్ ఫాం ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. సోనీ లైవ్ టీవీ వారి సోనీ లైవ్ ఓటిటి త్వరలో రాబోతుంది. 

కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళ సౌత్ భాషలకు ఈ ఓటిటి రాబోతుంది. తమిళంలో మీడియా పర్సన్ కం ప్రొడ్యూసర్ ధనుంజయ్ ను హెడ్ గా పెట్టగా తెలుగులో నిర్మాత మధుర శ్రీధర్ ను హెడ్ గా పెట్టినట్టు తెలుస్తుంది. సోనీ లైవ్ తమ ఒరిజినల్ కంటెంట్ మూవీస్, వెబ్ సీరీస్ లతో ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. దానితో పాటుగా తెలుగులో కూడా వెబ్ సీరీస్ లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష