తమిళ హీరోలతో దిల్ రాజు సూపర్ ప్లాన్..!

June 17, 2021


img

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వరుస క్రేజీ ప్రాజెక్టులతో సత్తా చాటుతున్నాడు. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు ఇప్పుడు తమిళ స్టార్ హీరోలతో సినిమాలకు సిద్ధం అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి డైరక్షన్ లో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా సూర్య తో కూడా దిల్ రాజు సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుతుంది. 

బోయపాటి శ్రీను డైరక్షన్ లో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. మొత్తానికి ఇద్దరు తమిళ హీరోలతో దిల్ రాజు సినిమాలు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాలకు సంబందించిన న్యూస్ బయటకు వస్తాయని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష