సూపర్ హిట్ సీక్వల్ లో చిట్టికి ఛాన్స్..!

June 15, 2021


img

అనుదీప్ కెవి డైరక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా జాతిరత్నాలు. స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించారు. సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఫరియా అబ్ధుల్లా నటించింది. సినిమాలో చిట్టి పాత్రలో ఫరియా తన నటనతో మెప్పించింది.

జాతిరత్నాలు సూపర్ హిట్ అవడంతో అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా మంచు విష్ణు హీరోగా సూపర్ హిట్ మూవీ ఢీకి సీక్వల్ గా వస్తున్న ఢీ అండ్ ఢీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఫరియా. శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన ఢీ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ గా మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫరియా ఛాన్స్ కొట్టేసింది. తప్పకుండా ఈ మూవీ ఫరియా కెరియర్ కు హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.



Related Post

సినిమా స‌మీక్ష