అలాంటిదేమి లేదంటున్న పాయల్..!

June 10, 2021


img

ఆరెక్స్ 100 తో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ సినిమా ఇచ్చిన పాపులారిటీని వాడుకుని వరుస సినిమాలు చేస్తుంది. అయితే మళ్లీ మరో ఆరెక్స్ 100 లాంటి సినిమా పడితేనే కాని పాయల్ ఫాంలోకి వచ్చేలా లేదని అనిపిస్తుంది. సినిమాలైతే చేస్తుంది కాని పెద్దగా ప్రేక్షకాదరణ లభించడం లేదు. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టంట్ గా వస్తుందని వార్తలు వచ్చాయి.

తనపై వస్తున్న బిగ్ బాస్ వార్తలపై స్పందించింది పాయ రాజ్ పుత్. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పిన పాయల్ బిగ్ బాస్ సీజన్ 5లో తాను కాంటెస్టంట్ గా వెళ్తున్నా అంటూ వస్తున్న వార్తలపై ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇలాంటి వార్తలు రాసేముందు తన టీం తో కన్ ఫర్మేషన్ చేసుకుంటే బెటర్ అని అంటుంది పాయల్. సో సీజన్ 5లో పాయల్ వస్తుందని కలలుకన్న ఫ్యాన్స్ కు అమ్మడు షాక్ ఇచ్చింది.Related Post

సినిమా స‌మీక్ష