సంక్రాంతికి పవన్ రావడం ఫిక్స్..!

June 10, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లుతో పాటుగా మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ కూడా సెట్స్ మీద ఉంది. అసలైతే క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. హిస్టారికల్ మూవీ అవడంతో సినిమా షూటింగ్ కు టైం పడుతుంది. అందుకే సంక్రాంతికి పవన్ చేస్తున్న అయ్యప్పనుం కోషియం రీమేక్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఈ రీమేక్ ను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రం మాటలు అందిస్తున్న ఈ సినిమాలో పవన్ తో పాటుగా రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్, రానాల మధ్య ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుదని అంటున్నారు. క్రిష్, సాగర్ చంద్ర సినిమాల తర్వాత హరీష్ శంకర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష