పుష్ప లో మెగాస్టార్..?

June 10, 2021


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా రెండు పార్టులుగా వస్తునని అంటున్నారు. అయితే పుష్ప రెండు పార్టులకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా పుష్ప గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉంటారని టాక్.

బన్నీ సినిమాలో చిరంజీవి ఇది నిజంగా మెగా, అల్లు ఫ్యాన్స్ కు ట్రీట్ అన్నట్టే లెక్క. సుకుమార్ స్పెషల్ ఇంట్రెస్ట్ తో పుష్ప సినిమాలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ఒక పాటలో చిరు ఇలా వచ్చి అలా వెళ్తే బాగుంటుందని చెప్పారట. అల్లు అర్జున్ కూడా అందుకు ఓకే చెప్పడంతో చిరు స్పెషల్ సాంగ్ పై ఇప్పుడు చర్చ మొదలైంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అసలైతే ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష