మారుతి డైరక్షన్ లో సంతోష్ శోభన్..!

June 09, 2021


img

ప్రతిరోజూ పండుగే సినిమా హిట్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అనే సినిమా మొదలు పెట్టాడు మారుతి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఏక్ మిని కథతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ హీరోగా మారుతి డైరక్షన్ లో ఓ వెబ్ సీరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ లో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ కు మంచి రోజులు వచ్చాయి టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

సంతోష్ శోభన్ కు ఏక్ మిని కథ హిట్ తో నిజంగానే మంచి రోజులు రాగా అదే టైటిల్ తో ఇప్పుడు వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఇదే కాదు నందిని రెడ్డి డైరక్షన్ లో కూడా సినిమా ఛాన్స్ కొట్టేశాడు సంతోష్ శోభన్. మొత్తానికి ఇన్నాళ్లకు సంతోష్ శోభన్ కెరియర్ గాడిన పడిందని చెప్పుకోవచ్చు. ఇలానే కెరియర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అతను మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది.Related Post

సినిమా స‌మీక్ష