సమంత 'శాకుంతలం'లో జూనియర్ స్టార్స్..!

June 09, 2021


img

గుణశేఖర్ డైరక్షన్ లో సమంత లీడ్ రోల్ లో వస్తున్న సినిమా శాకుంతలం. గుణ టీం వర్క్స్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతతో పాటుగా మళయాళ స్టార్ దేవ్ మోహన్ మేల్ లీడ్ గా నటిస్తున్నాడు. సినిమాలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో జూనియర్ స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రకు అల్లు అయాన్ లేదా ఎన్.టి.ఆర్ తనయుడు అభయ్ రాం ఈ ఇద్దరిలో ఒకరు నటిస్తారని తెలుస్తుంది.

మహేష్ 1 నేనొక్కడినే సినిమాలో గౌతం కృష్ణ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లు అయాన్, అభయ్ రాం ల స్క్రీన్ టైం కూడా వచ్చిందని టాక్. అయితే గుణశేఖర్ శాకుంతలంలో ఇద్దరు ఉంటారా లేక ఒకరే ఉంటారా అన్నది త్వరలో తెలుస్తుంది. లాక్ డౌన్ ఉన్నా సరే శాకుంతలం సినిమాను 50 శాతం పూర్తి చేశారట గుణశేఖర్ ఇక మిగతా సగం కూడా త్వరలో పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.Related Post

సినిమా స‌మీక్ష