ఎన్.టి.ఆర్ కాదు అల్లు అర్జున్..!

June 09, 2021


img

ఉప్పెన సినిమాతో మొదటి సినిమానే సూపర్ హిట్ అందుకున్నాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు. తన సెకండ్ ప్రాజెక్ట్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ బుచ్చి బాబుతో చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా బుచ్చి బాబు తన సెకండ్ సినిమా ఎన్.టి.ఆర్ తో కాదు అల్లు అర్జున్ తో చేస్తాడని చెబుతున్నారు.

ఎన్.టి.ఆర్ కాదన్నాడో లేక తర్వత చూద్దాం అన్నాడో కాని బుచ్చి బాబు అల్లు అర్జున్ కోసం కథ సిద్ధం చేశాడట. కథ విన్న బన్నీ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పడని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి బుచ్చి బాబు సినిమాలో ఎన్.టి.ఆర్ చేస్తాడా లేక అల్లు అర్జున్ నటిస్తాడా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష