విజయ్ దేవరకొండ లైగర్ క్లైమాక్స్ అదిరిపోద్దట..!

June 09, 2021


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా లైగర్. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ముంబై బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా పరిస్థితులు అనుకూలించగానే షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో లేటెస్ట్ గా లైగర్ సినిమా క్లైమాక్స్ గురించి ఒక న్యూస్ బయటకు వచ్చింది. లైగర్ క్లైమాక్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ ట్విస్ట్, ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తాయని చిత్రయూనిట్ చెబుతున్నారు. సెప్టెంబర్ 9న రిలీజ్ ప్లాన్ చేసిన లైగర్ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మేకర్స్ మాత్రం లైగర్ కొత్త రిలీజ్ ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు.Related Post

సినిమా స‌మీక్ష