శ్రీనివాస రెడ్డి హీరోగా ముగ్గురు మొనగాళ్ళు

May 18, 2021


img

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ శ్రీనివాస రెడ్డి ప్రధాన పాత్రలో ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు తెలిపారు. ఈ ముగ్గురి స్నేహితులు వినికిడి లోపం, అంధత్వం, మూగతనంతో బాధపడుతున్న పాత్రలలో నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలో రాజా రవీంద్ర, వెన్నెల రామారావు, జెమిని సురేష్, భద్రం నటిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చుత రామారావు నిర్మాత వ్యవహరిస్తుండగా సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విడుదల తేదీలను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.Related Post

సినిమా స‌మీక్ష