రవితేజ కిలాడీ థియేటర్లలోనే విడుదల

May 17, 2021


img

రవితేజ హీరోగా నటిస్తున్న కిలాడి సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాత కోనేరు సత్యనారాయణ తెలిపారు. కిలాడి...ప్లే స్మార్ట్ (ట్యాగ్ లైన్‌) సినిమా మే 28న విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో లాక్‌డౌన్‌తో థియేటర్లన్నీ మూసేయడంతో ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదల అవుతుందని కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ తమ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. 

రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటించారు. కోనేరు సత్యనారాయణ, బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియో సంయుక్తంగా దీనిని నిర్మించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన కిలాడి ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.Related Post

సినిమా స‌మీక్ష