కోలీవుడ్‌లో మరో ఇద్దరు నటులు మృతి

May 17, 2021


img

భారతీయ సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి కబళిస్తోంది. తాజాగా తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు   అయ్యప్పన్‌ గోపి శనివారం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఇప్పుడిప్పుడే తమిళ సినిమాలో పైకి ఎదుగుతున్న నితీష్ వీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం కనుమూశారు. కరోనాకు భయపడి సినిమా షూటింగులు పూర్తిగా నిలిపివేస్తే వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది వారి కుటుంబాలు రోడ్డున పడి ఆకలితో అలమటించవలసి వస్తుంది. అలాగని సినిమా షూటింగులు జరిగితే వాటిలో పాల్గొనేవారు కరోనా బారినపడుతున్నారు. వారిలో కొందరు చనిపోతున్నారు. ఈ పరిస్థితులలో సినీ పరిశ్రమ ఏవిదంగా ముందుకు సాగాలో తెలియని పరిస్థితి నెలకొంది.   Related Post

సినిమా స‌మీక్ష