ఓటిటిలో ఆకాష్ రొమాంటిక్

May 17, 2021


img

డైరక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రొమాంటిక్. ఆకాష్ పూరీ సరసన కెతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసినా పరిస్థితులు సహకరించకపోవడంతో ఓటిటికి ఓటేస్తున్నట్టు తెలుస్తుంది. 

సినిమాను ముందు అమేజాన్ ప్రైమ్ తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. కాని ఫైనల్ గా ఆకాష్ రొమాంటిక్ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు కొనేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే రొమాన్స్ డిజిటల్ స్క్రీనింగ్ ఉంటుందని టాక్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న రొమాన్స్ లో కెతిక శర్మ అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. మొదటి సినిమా రిలీజ్ అవకుండానే కెతిక శర్మకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ నాగ శౌర్య లక్ష్యలో నటిస్తున్న అమ్మడు రీసెంట్ గా ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా కూడా సైన్ చేసింది. రొమాంటిక్ తర్వాత కెతిక డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని టాక్.Related Post

సినిమా స‌మీక్ష