సలార్ లో సర్ ప్రైజ్ అదే.. ఒక్కరు కాదు ఇద్దరట..!

May 17, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సలార్. కె.జి.ఎఫ్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అంటూ మరో సెన్సేషన్ కు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను కూడా భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కూడా స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని టాక్.

ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే ప్రభాస్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడట. సలార్ లో తండ్రి కొడులుగా ప్రభాస్ నటిస్తున్నట్టు టాక్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ మిడిల్ ఏజ్ గెటప్ లో డిఫరెంట్ లుక్ తో ఉంటాడని అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ నుండి వచ్చిన ఈ న్యూస్ ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తుంది. సలార్ సినిమాను కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష