ఇలియానా డిజిటల్ ఎంట్రీ..!

May 07, 2021


img

సౌత్ స్టార్ హీరోయిన్ ఇలియానా ఇప్పుడంటే ఫాం లో లేదు కాని పోకిరి టైం లో అమ్మడంటే తెలుగు ఆడియెన్స్ కు సూపర్ క్రేజ్. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ పాపులర్ అయిన ఇలియానా ఇక్కడ బిజీగా ఉన్న టైం లోనే బాలీవుడ్ నుండి ఆఫర్ రాగానే అక్కడకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేని ఇలియానా సౌత్ సినిమాలకు దూరమైంది. 

చాలా రోజుల తర్వాత రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది ఇలియానా. ఇక లేటెస్ట్ గా ఇలియానా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అమేజాన్ ప్రైమ్ లో ఇలియానాతో ఒక స్పెషల్ టాక్ షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆహాలో సమంత, తమన్నా తమ షోలతో అలరిస్తున్నారు. సమంత సామ్ జామ్ షో చేయగా తమన్నా లెవెన్ త్ అవర్ చేసింది. ఇక ఇలియానా కూడా టాక్ షోకి రెడీ అవుతుందని తెలుస్తుంది. ఇలియానా షో క్లిక్ అయితే మళ్లీ అమ్మడు తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు.    Related Post

సినిమా స‌మీక్ష