సందీప్ కిషన్ 'టైగర్' కాంబో రిపీట్..!

May 07, 2021


img

యువ హీరో సందీప్ కిష్ హీరోగా వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో మరో సినిమా రాబోతుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన టైగర్ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ చేస్తున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వి.ఐ ఆనంద్ ఆ తర్వాత అల్లు శిరీష్ తో ఒక్క క్షణం.. రవితేజతో డిస్కో రాజా సినిమాలు చేశాడు కాని ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.   

ఇక మరోసారి సందీప్ కిషన్ తో సూపర్ నాచురల్ ఫాంటసీ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సందీప్ కిషన్ 28వ సినిమాగా వస్తున్న ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందని అంటున్నారు. కొత్త కథలతో సినిమాలు చేస్తున్నా ప్రేక్షకులను అలరించడంలో విఫలమవుతున్న సందీప్ కిషన్ వి.ఐ ఆనంద్ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష