యాత్ర డైరక్టర్ లేడీ ఓరియెంటెడ్ మూవీ..!

May 07, 2021


img

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో యాత్ర సినిమా చేశాడు డైరక్టర్ మహి వి రాఘవ్. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరక్టర్ తన నెక్స్ట్ సినిమాను ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలైతే యాత్ర 2 చేయాలని అప్పట్లో ఎనౌన్స్ చేసినా అది ఎందుకో వర్క్ అవుట్ అవలేదు. ఇక లేటెస్ట్ గా ఓ లేడీ ఓరియెంటెడ్ కథతో మహి వి రాఘవ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో సెటైరికల్ గా ఉంటుందని తెలుస్తుంది.

సినిమాలో లీడ్ రోల్ లో శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుందని టాక్. కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. నాని జెర్సీ సినిమాలో తన నటనతో మెప్పించింది శ్రద్ధా శ్రీనాథ్. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ ఎలా అలరిస్తుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష