ఆదిపురుష్ హైదరబాద్ కు షిఫ్ట్..!

May 07, 2021


img

ఓం రౌత్ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ముందు సినిమాను ముంబైలోనే షూట్ చేయాలని అనుకున్నారు. అయితే అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఆదిపురుష్ టీం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆదిపురుష్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. సినిమా ఎక్కువ భాగం ఇండోర్ స్టూడియోలోనే షూట్ చేస్తున్నారట. సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది.

చిత్రయూనిట్ ఆదిపురుష్ మొత్తం సినిమాను హైదరాబాద్ లోనే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. రావణాసురుడు పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు. జూలై 30 రాధే శ్యాం రిలీజ్ ఫిక్స్ చేశారు.  Related Post

సినిమా స‌మీక్ష