నాన్నకు ప్రేమతో.. అల్లు అర్జున్ కోసం అర్హ ఏం చేసిందంటే..!

May 06, 2021


img

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించి సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాడు బన్నీ. ఇక హోం క్వారెంటైన్ లో ఉన్న తన తండ్రికి తన చేత్తో స్పెషల్ దోశ వేసి పంపించింది అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ. అల్లు అర్జున్ కోసం అర్హ సొంతంగా దోశ వేసి అందించిందని తెలుస్తుంది.  

అయితే అదే విషయాన్ని అల్లు అర్జున్ షేర్ చేస్తూ తన జీవితంలో మర్చిపోలేని దోశ ఇది అని చెప్పుకొచ్చారు. నాన్నకు ప్రేమతో అల్లు అర్హ బన్నీకి స్పెషల్ దోశ వేసి ఇచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు కాబట్టి అల్లు అర్హకి బన్నీ గిఫ్ట్ ఇవ్వలేకపోయాడు కాని అర్హ చేసిన దోశకు కానుకగా బన్నీ పెద్ద కానుకే ఇచ్చే వాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష