లైగర్ టీజర్ అప్పుడు వస్తుందా..?

May 06, 2021


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. కరోనా ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ ప్రభావంతో లైగర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడ్డది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం లైగర్ అప్డేట్స్ గురించి పూరీ జగన్నాథ్ ను టార్గెట్ చేస్తున్నారు.   

ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం లైగర్ టీజర్ ను ఈ నెల 9న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా లైగర్ టీజర్ వస్తుందని టాక్. సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. రౌడీ హీరో మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న పూరీ ఈసారి నేషనల్ వైడ్ గా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష