తమిళ హిట్ సినిమా రీమేక్ లో సునీల్..?

May 06, 2021


img

స్టార్ కమెడియన్ కం హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ ఈమధ్య హీరోగా ప్రయత్నాలు ఆపేసి మళ్లీ కమెడియన్ గా బిజీ అవుతున్నాడు. ఆల్రెడీ సునీల్ కమెడియన్ గా రెండు మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఈమధ్యనే వి.ఎన్ ఆదిత్య డైరక్షన్ లో మర్యాద కృష్ణయ్య సినిమాకు సైన్ చేశాడు సునీల్. ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలాఉంటే సునీల్ మరో సూపర్ హిట్ రీమేక్ పై కన్నేసినట్టు తెలుస్తుంది.   


తమిళంలో సూపర్ హిట్టైన మండేలా సినిమాను తెలుగులో సునీల్ రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మండోన్నే అశ్విన్ డైరెక్ట్ చేసిన మండేలా సినిమాలో యోగిబాబు లీడ్ రోల్ లో నటించాడు. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజై సూపర్ హిట్ అందుకున్న మండేలా సినిమా తెలుగులో సునీల్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. డైరక్టర్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.   



Related Post

సినిమా స‌మీక్ష