పుష్ప టీజర్ రికార్డ్ కంటిన్యూస్..!

May 04, 2021


img

స్టైలిష్ స్టార్ కమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. సుకుమార్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన టీజర్ సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం టీజర్ తోనే రికార్డులను సృష్టిస్తుంది పుష్ప. అల్లు అర్జున్ పుష్ప టీజర్ 60 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. టీజర్ తోనే రికార్డ్ వ్యూస్ తో అదరగొడుతున్నాడు అల్లు అర్జున్.

రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ క్రేజీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది. టీజర్ తోనే రికార్డులను టార్గెట్ పెట్టుకున్న పుష్ప సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో బన్నీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష