వెంకీతో వైష్ణవ్ తేజ్..!

May 04, 2021


img

టైటిల్ చూసి విక్టరీ వెంకటేష్ మన వెంకీమామ మరో మల్టీస్టారర్ కు సిద్ధమయ్యాడని అనుకోవచ్చు.. కాని వెంకీ అంటే వెంకీ మామ కాదు సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీకుడుముల. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన హిట్ జోష్ తో వరుస  క్రేజీ ప్రాజెక్టులను చేస్తూ వెళ్తున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన రిలీజ్ కు ముందే క్రిష్ డైరక్షన్ లో సెకండ్ సినిమా పూర్తి చేశాడు వైష్ణవ్ తేజ్. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు టైటిల్ గా జంగిల్ బుక్ అని పెడుతున్నట్టు టాక్.

ఇక రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ థర్డ్ మూవీ తమిళ అర్జున్ రెడ్డి ఫేం గిరీశయ్య డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక నాల్గవ సినిమాకు సంబందించిన క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది. సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుముల డైరక్షన్ లో వైష్ణవ్ తేజ్ సినిమా కన్ ఫాం అయ్యిందని తెలుస్తుంది. ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ హిట్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ సినిమా చరణ్, మహేష్ లాంటి వారితో ప్రయత్నించాడు. కాని వాళ్లెవరు సినిమా చేసేందుకు రెడీగా లేరని తెలియడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ తో వెంకీ క్రేజీ కాంబోలో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష