వెంకటేష్, వరుణ్ తేజ్ మరో రీమేక్ మూవీ..?

May 04, 2021


img

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి ఎఫ్ 2 సినిమాలో నటించారు. ఆ సినిమా సక్సెస్ అవడంతో ఎఫ్3 సినిమా చేస్తున్నారు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత కూడా ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది. మళయాళంలో సూపర్ హిట్టైన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తారని తెలుస్తుంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఈ సినిమా రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఓ సినిమా హీరో.. ఆర్.టి.ఏ ఆఫీసర్ మధ్య జరిగే కథనే డ్రైవింగ్ లైసెన్స్ మూవీ కథాంశం. పృధ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు సినిమాలో ప్రధాన పాత్రలుగా నటించారు. జీన్ పాల్ లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2019లో వచ్చి సూపర్ సక్సెస్ అయ్యింది. మరి తెలుగులో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష