మహేష్, త్రివిక్రం కాంబో టైటిల్ అదేనా..!

May 04, 2021


img

సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దేని హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తుంది. 2005 లో అతడు.. 2010 లో ఖలేజా సినిమాలు చేయగా 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రం కలిసి సినిమా చేస్తున్నారు. సెట్స్ మీదకు వెళ్లకుండానే సినిమాను 2022 ఏప్రిల్ లో రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మహేష్, త్రివిక్రం ఈసారి పార్ధు టైటిల్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. అతడు సినిమాలో పార్ధు పాత్రతోనే మహేష్ ఎంట్రీ ఉంటుంది. ఇక ఖలేజాలో రామరాజుగా కనిపిస్తాడు. హ్యాట్రిక్ కాంబినేషన్ టైటిల్ తోనే పార్ధు అని పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఈ క్రేజీ కాంబో హ్యాట్రిక్ మూవీ ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష