నందమూరి మల్టీస్టారర్..?

May 03, 2021


img

అక్కినేని మనం సినిమా చూశాక నందమూరి ఫ్యామిలీ నుండి అలాంటి ఓ మల్టీస్టారర్ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. లేటెస్ట్ గా నందమూరి మల్టీస్టారర్ కు రంగం సిద్ధమైందని టాక్. ఓ స్టార్ రైటర్ నందమూరి మల్టీస్టారర్ కథని సిద్ధం చేశాడని తెలుస్తుంది. అయితే ఈ మల్టీస్టారర్ లో బాలకృష్ణ, కళ్యాణ్ రాం మాత్రమే నటిస్తారని అంటున్నారు. ఫ్యామిలీ మల్టీస్టారర్ అంటే అందరు ఉండాలి కదా అనొచ్చు ఎన్.టి.ఆర్ కూడా ఈ మల్టీస్టారర్ మూవీలో ఉంటాడట కాని తారక్ ఇలా వచ్చి అలా వెళ్లే రోల్ మాత్రమే చేస్తాడని టాక్.

మొత్తానికి నందమూరి మల్టీస్టారర్ సినిమాపై ఈ న్యూస్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఒకే వేదిక పంచుకుంటేనే నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు అలాంటిది వీళ్లిద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఆ సినిమా రేంజ్ వేరే లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. మరి ఈ మల్టీస్టారర్ కథ ఎలా ఉంటుంది.. సినిమా రేంజ్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష