ఇందువదన పోస్టర్.. షాక్ ఇచ్చిన వరుణ్..!

May 03, 2021


img

కొత్తబంగారు లోకం ఫేం వరుణ్ సందేశ్ హీరోగా కొత్త సినిమా వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3లో జంటగా వెళ్లి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నాడు. ఇందువదన టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను ఎం.ఎస్.ఆర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. వరుణ్ తేజ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఇది పిరియాడికల్ మూవీగా వస్తుందని అర్ధమవుతుంది.

సినిమా టైటిల్ ఆ టైటిల్ కు తగినట్టుగానే ఉన్న పోస్టర్ ఇవన్ని చూస్తుంటే ఈసారి వరుణ్ సందేశ్ పక్కా హిట్ టార్గెట్ తో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను మాధురి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఇందువదన సినిమాలో వరుణ్ తేజ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉందని చెప్పొచ్చు. మరి వరుణ్ తేజ్ ఇందువదన ఎలా ఉండబోతుంది అన్నది టీజర్, ట్రైలర్ వస్తేనే కాని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష