రెజినా, నివేదా.. షాకిని ఢాకిని..!

May 03, 2021


img

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ రెజినా కసాండ్రా, నివేదా థామస్ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. సుధీర్ వర్మ డైరక్షన్ లో కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ కు రీమేక్ గా ఓ సినిమా వస్తుంది. ఈ సినిమా రీమేక్ టైటిల్ గా షాకిని ఢాకిని అని పెడుతున్నట్టు తెలుస్తుంది. సినిమా టైటిల్ ను బట్టే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చెప్పొచ్చు.

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ బ్యానర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అల్రెడీ సురేష్ బాబు కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమాను రీమేక్ చేశారు. సమంత లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమా లైన్ లో పెడుతున్నారు. కెరియర్ లో వెనకపడ్డ రెజినా.. వకీల్ సాబ్ తో సక్సెస్ అందుకున్న నివేదా థామస్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ షాకిని ఢాకిని ఎలా ఉంటుందో చూడాలి. స్వామిరారా తర్వాత డైరక్టర్ గా హిట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న సుధీర్ వర్మ ఈ సినిమాతో అయినా అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష