ఎన్.టి.ఆర్ సినిమాలో అరవింద స్వామి..!

May 03, 2021


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లే ఈ సినిమాను 2022 ఏప్రిల్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. సెట్స్ మీదకు వెళ్లకుండానే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించి షాక్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇక ఇదిలాఉంటే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. 

సినిమాలో ఎన్.టి.ఆర్ కు ఈక్వల్ గా విలన్ రోల్ ఉంటుందని తెలుస్తుంది. ఆ పాత్రకి ఇద్దరు ముగ్గురు స్టార్స్ ను అనుకోగా ఫైనల్ గా కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అరవింద స్వామిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. తమిళంలో ఒకప్పుడు హీరోగా చేసి కొన్నాళ్లు కెరియర్ గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం విలన్ గా వరుస సినిమాలు చేస్తున్న అరవింద స్వామి తెలుగులో కూడా రాం చరణ్ ధృవ సినిమాలో నటించి మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. ఎన్.టి.ఆర్ తో అరవింద స్వామి ఆడియెన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష