పవన్ కళ్యాణ్ సర్.. 'సర్' అంతే..!

May 02, 2021


img

వకీల్ సాబ్ ఓటిటిలో వచ్చింది. మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ సినిమా చూసింది. సినిమా చూసి ఆమె నచ్చిందని మెసేజ్ పెట్టింది. ఇందులో విషయం ఏముంది అనేగా డౌట్ అక్కడే ఉంది అసలు మ్యాటర్. సినిమా చూసిన అనుపమ వకీల్ సాబ్ సినిమా చూశాను పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అడ్డు గోడలను బ్రేక్ చేసి కథాబలం ఉన్న సినిమా చేశారు ముగ్గురు లేడీస్ తమ సత్తా చాటారు.. ప్రకాశ్ రాజ్ సర్ మీరు లేనిదే సినిమా పూర్తవదు అని ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది.

ఈ మెసేజ్ ఆమెకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ప్రకాశ్ రాజ్ ని సర్ అని సంబోధించిన అనుపమ పవన్ కళ్యాణ్ కు మాత్రం ముందు వెనక ఏమి పెట్టలేదు. అందుకే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది కోపం తెప్పించింది. ఆమెను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. దానితో తప్పుసరిదిద్దుకున్న అనుపమ సో సారీ గాయ్స్.. రియలైజ్ అయ్యాను పవన్ కళ్యాణ్ సర్ విత్ ఆల్ రెస్పెక్ట్ అండ్ లవ్ అని మళ్లీ మెసేజ్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ను సర్ అనడం మర్చిపోయిన అనుపమకు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎటాక్ చేసి మరి పవన్ కళ్యాణ్ సర్ పవన్ సర్ అంతే అనేలా చేశారు.  
Related Post

సినిమా స‌మీక్ష