డిజిటల్ ఫ్లాట్ ఫాం పై వకీల్ సాబ్ హవా..!

May 02, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మించారు. ఏప్రిల్ 9న రిలీజై సూపర్ హిట్ అందుకున్న వకీల్ సాబ్ రెండో వారంలోనే కరోనా కేసులు పెరగడంతో సినిమా మీద ఎఫెక్ట్ పడ్డది. వకీల్ సాబ్ సినిమాను ఏప్రిల్ 30న అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. సినిమా రిలీజైన 21 రోజులకే ఓటిటిలో వచ్చేసింది వకీల్ సాబ్. 

టాక్ బాగున్నా థియేటర్ లో చూడలేకపోయాం అనుకున్న వారంతా వకీల్ సాబ్ సినిమాను అమేజాన్ ప్రైమ్ లో చూసేస్తున్నారు. అందుకే ఈ సినిమా హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన సినిమాగా రికార్డ్ నెలకొల్పే దిశగా పరుగులు తీస్తుంది. అమేజాన్ ప్రైమ్ ఇండియన్ సినిమాల హిస్టరీలో వకీల్ సాబ్ సరికొత్త రికార్డ్ సృష్టిస్తుందని అంటున్నారు. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్యా నాగళ్ల ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.   Related Post

సినిమా స‌మీక్ష