యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి మృతి..!

May 02, 2021


img

ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రదీప్ కు ఈమధ్యనే కరోనా పాజిటివ్ రాగా ప్రస్తుతం ఆయన హోం క్వారెంటైన్ లో ఉంటున్నారని తెలుస్తుంది. ప్రదీప్ మాచిరాజు తండ్రి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధడుతున్నారని సమాచారం.. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో రాత్రి ఆయన కన్నుమూశారు. బుల్లితెర మీద తన టాలెంట్ తో మెప్పిస్తూ మేల్ యాంకర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాడు ప్రదీప్ మాచిరాజు. తను ఏ షో చేసినా సూపర్ ఎంటర్టైన్ చేసే ప్రదీప్ ఇంట నేడు విషాదం చోటు చేసుకుంది.  Related Post

సినిమా స‌మీక్ష