'గబ్బర్ సింగ్' రవితేజ అయ్యుంటే..!

May 02, 2021


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేష లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఖుషి తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ పదేళ్ల తర్వాత ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. పవన్ శిష్యుడు.. వీరాభిమాని బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా అప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చారు.

అయితే పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టే గబ్బర్ సింగ్ ఆ రేంజ్ లో హిట్ అయ్యిందని చెప్పొచ్చు. ఒకవేళ అదే గబ్బర్ సింగ్ సినిమా మాస్ మహరాజ్ రవితేజ చేసుంటే రిజల్ట్ ఎలా ఉండేది. అదేంటి అలా ఎందుకు అంటే.. రవితేజతో మంచి ర్యాపో ఉన్న బండ్ల గణేష్ అప్పటికే రవితేజతో ఆంజనేయులు సినిమా నిర్మించాడు. దబ్బాంగ్ రీమేక్ రైట్స్ కొనేసిన బండ్ల గణేష్ మొదట ఆ సినిమాను రవితేజతో చేయాలని అనుకున్నారట. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అప్పటికే తీన్ మార్ సినిమా చేసిన బండ్ల గణేష్ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో బండ్ల గణేష్ ను పిలిచి మరో సినిమా ఛాన్స్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. అలా రవితేజతో తీయాలని అనుకున్న గబ్బర్ సింగ్ పవన్ ఖాతాలో పడ్డది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగినట్టుగా డైరక్టర్ హరీష్ శంకర్ దబాంగ్ కథను తెలుగులో అదిరిపోయే రేంజ్ లో రీమేక్ చేశారు.  Related Post

సినిమా స‌మీక్ష