అనసూయ థ్యాంక్ యు బ్రదర్.. ఆ సినిమాకు ఫ్రీమేకా..?

May 02, 2021


img

జబర్దస్త్ యాంకర్ అనసూయ లీడ్ రోల్ లో అశ్విన్ విరాజ్ మేల్ లీడ్ గా వస్తున్న సినిమా థ్యాంక్ యు బ్రదర్. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 7న ఆహా ఓటిటిలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యు బ్రదర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచగా ఈ సినిమా ఓ నైజీరియన్ మూవీకి ఫ్రీమేక్ అనేస్తున్నారు నెటిజెన్లు. ఈమధ్యకాలంలో ఏదైనా టీజర్, ట్రైలర్ కాదు కాదు పోస్టర్ రిలీజ్ చేసినా ఇది దానిలా ఉంది.. ఇది ఆ సినిమాకు కాపీ అంటూ నెటిజెన్లు చెప్పేస్తున్నారు. థ్యాంక్ యు బ్రదర్ సినిమాను కూడా నైజీరియన్ సినిమా ఎలివేటర్ బేబీ కు దగ్గరగా ఉందని అంటున్నారు.


2019లో వచ్చిన నైజీరియన్ సినిమా ఎలివేటర్ బేబీ. అనసూయ నటించిన ట్యాంక్ యు బ్రదర్ సినిమా ట్రైలర్ కూడా ఈ సినిమా కథే అంటూ చెబుతున్నారు. ఒకవేళ డైరక్టర్ ఆ సినిమా చూసి ఈ కథ రాసుకున్నాడా లేక తనకు వచ్చిన సొంత ఆలోచన అన్నది తెలియదు. ఒకవేళ సినిమా చూశాక ఎలివేటర్ బేబీ కథకు దగ్గరా ఉంటే మాత్రం అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలివేటర్ బేబీకి ఫ్రీమేక్ అని ఫిక్స్ అవ్వొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష