అల్లు అర్జున్, మురుగదాస్ క్రేజీ కాంబో ఫిక్స్..?

May 02, 2021


img

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది కాని ఆ ప్రాజెక్ట్ ఎందుకో హోల్డ్ లో పడినట్టు తెలుస్తుంది. బన్నీ సినిమాను కాదని ఎన్.టి.ఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు కొరటాల శివ. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పొచ్చు. అయితే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం అల్లు అర్జున్ సౌత్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన చేసిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి హిట్ అయ్యాయి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్, మహేష్ తో స్పైడర్ సినిమాలు చేశారు. ఇక లేటెస్ట్ గా మురుగదాస్, బన్నీ కాంబో సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తారని తెలుస్తుంది. మురుగదాస్ సినిమా అంటే మరోసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష