అనుష్క పెళ్లి.. మరో కొత్త న్యూస్..!

May 01, 2021


img

స్వీటీ అనుష్క పెళ్లెప్పుడు.. మీడియా వాళ్లకి మ్యాటర్ ఏం లేకపోతే అనుష్క పెళ్లి మీద న్యూస్ రాసేస్తుంటారు. ఇప్పటికే ప్రభాస్ తో అనుష్క పెళ్లంటూ నానా హంగామా చేశారు. మీరు ఎన్నిసార్లు వార్తలు రాసినా మేము స్పందించమని వాళ్లు సైలెంట్ అయ్యారు. ఆ మధ్య ఓ బడా బిజినెస్ మెన్ తో అనుష్క పెళ్లంటూ కొన్నాళ్లు హడావిడి చేశారు. లేటెస్ట్ గా అనుష్క దుబాయ్ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు.

అదేదో వాళ్ల ఫ్యామిలీ కన్ ఫాం చేసి చెప్పినట్టుగా.. దుబాయ్ బిజినెస్ మెన్ తో అనుష్క పెళ్లి.. అదికూడా తనకన్నా వయసులో చిన్నోడితో అనుష్క పెళ్లికి సిద్ధమైందని వార్తలు రాస్తున్నారు. ఈ విషయం తెలిసి అనుష్క ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అనుష్క పెళ్లిపై ఇలాంటి వార్తలకు ఎండ్ కార్డ్ పడాలంటే అనుష్క పెళ్లి చేసుకోవాల్సిందే. 

నిశ్శబ్ధం సినిమా తర్వాత తెలుగులో సినిమాలేవి కమిటవని అనుష్క లేటెస్ట్ గా రారా కృష్ణయ్య ఫేం మహేష్ డైరక్షన్ లో సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమాలో జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి మేల్ లీడ్ గా చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.Related Post

సినిమా స‌మీక్ష