మారుతి డైరక్షన్ లో ఆరెక్స్ హీరో..!

April 20, 2021


img

టాలీవుడ్ మినిమం గ్యారెంటీ డైరక్టర్ మారుతి ప్రతిరోజూ పండుగే సినిమాతో సత్తా చాటాడు. ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమాను గోపీచంద్ హీరోగా చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ లో పక్కా కమర్షియల్ అంటూ వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మారుతి యువ హీరో కార్తికేయతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆరెక్స్ 100 సినిమాతో హీరోగా సత్తా చాటిన కార్తికేయ వరుస సినిమాలైతే చేస్తున్నాడు కాని సక్సెస్ విషయంలో వెనకపడ్డాడు. రీసెంట్ గా వచ్చిన చావు కబురు చల్లగా సినిమాలో కూడా కార్తికేయ నటనకు మంచి మార్కులే పడ్డాయి కాని సినిమా నిరాశపరచింది. ఫైనల్ గా మారుతి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు కార్తికేయ. మారుతి అయినా కార్తికేయ కు హిట్ సినిమా ఇస్తాడేమో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష