ఎన్టీఆర్, విజయ్ క్రేజీ మల్టీస్టారర్..!

April 20, 2021


img

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కోలీవుడ్ స్టార్ విజయ్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. దళపతి విజయ్ తో వరుస సూపర్ హిట్లు సినిమాలు చేస్తున్న అట్లీ ఈసారి విజయ్ తో పాటుగా ఎన్.టి.ఆర్ ను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయాలని చూస్తున్నారట. తెలుగులో తారక్ తో సినిమా ఉంటుందని చెప్పిన అట్లీ విజయ్, ఎన్.టి.ఆర్ క్రేజీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో ఓ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. కొరటాల శివ సినిమా తర్వాత అట్లీ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, విజయ్ కాంబో సినిమా ఉంటుందని టాక్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా గురించి త్వరలో ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు.Related Post

సినిమా స‌మీక్ష