అఖిల్ తో ఆరెక్స్ 100..!

April 19, 2021


img

ఆరెక్స్ 100 అంటూ మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్ గా శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకు మహా సముద్రం అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి అక్కినేని హీరో అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

మహా సముద్రం సినిమాను చైతుతో కూడా చేయాలని ప్రయత్నించాడు అజయ్ భూపతి కాని అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. చైతు ప్రాజెక్ట్ మిస్సైనా సరే అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు అజయ్ భూపతి. సెట్స్ మీద ఉన్న మహా సముద్రం సినిమా కూడా బాగా వస్తుందని టాక్ రావడంతో అఖిల్ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. అఖిల్ బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా కూడా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది.Related Post

సినిమా స‌మీక్ష