రంగస్థలం కాంబో రిపీట్..!

April 19, 2021


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రంగస్థలం. నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి చరణ్ నట విశ్వరూపం చూపించిన సినిమాగా రంగస్థలం సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలతో చరణ్.. పుష్ప సినిమాతో సుకుమార్ చాలా బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చేశాడు.

పుష్ప తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. కాని ఆ సినిమా కన్నా ముందు చరణ్ తో మరో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట సుకుమార్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్, ఆచార్య తర్వాత సుకుమార్ తో చరణ్ సినిమా అంటే అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇదే కాకుండా శంకర్ డైరక్షన్ లో మరో భారీ సినిమా చేస్తున్నాడు చరణ్. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.Related Post

సినిమా స‌మీక్ష